కుల్ భూషణ్ జాదవ్ కేసులో పాక్ పై భారత్ విజయం.. పాక్ కు అంతర్జాతీయ న్యాయస్థానం కీలక ఆదేశాలు

  • గూఢచర్యం ఆరోపణలపై పాకిస్థాన్ చెరలో ఉన్న  కుల్ భూషణ్
  • వియన్నా ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని ఐసీజే స్పష్టం
  • ఆయన నిర్బంధం అక్రమమని తేల్చిన న్యాయస్థానం
గూఢచర్యం ఆరోపణలపై పాకిస్థాన్ చెరలో ఉన్న భారత మాజీ నేవీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కేసులో పాక్ పై భారత్ విజయం సాధించింది. వియన్నా ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని ఈ రోజు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) స్పష్టం చేసింది. ఆయన నిర్బంధం అక్రమమని పాక్ ను ఎండగట్టింది. తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని పాక్ కు ఆదేశాలు జారీ చేసింది.

కాగా, భారత గూఢచార సంస్థ 'రా' కోసం గూఢచర్యానికి పాల్పడ్డాడంటూ ఆయనను 2016 మార్చి 3న పాకిస్థాన్ అరెస్ట్ చేసిన విషయం విదితమే. అనంతరం 2017లో పాక్ మిలిటరీ న్యాయస్థానం ఆయనకు మరణశిక్ష విధించింది. దీనిపై అభ్యంతరాలు తెలిపిన భారత్.. నెదర్లాండ్స్ లోని హేగ్ నగరంలో వున్న అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాల్ చేయడంతో దీనిపై విచారణ జరిగింది. ఈ కేసులో పాకిస్థాన్ పునఃసమీక్ష చేసే వరకు కుల్ భూషణ్ మరణశిక్ష అమలుపై అప్పట్లో ఐసీజే స్టే విధించింది. భారత్ సమర్పించిన ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం.. పాక్ దిద్దుబాటు చర్యలు చేపట్టాలంటూ ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది.
Go Back to Shorts
Pakistan
India
icj

More Telugu News